
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలి
సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ
వెల్దుర్తి, డిసెంబర్ 10, (సీమకిరణం న్యూస్):
రైతులు పండించిన వరి మొక్కజొన్న పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు చిన్నమాదులు డి రాజు చిన్న వ్యాపారస్తుల సంఘం అనీలు. భాష, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, చిలిపి కృష్ణ రైతులు సీమోను బోయినపల్లి రాముడు, మద్దిలేటి, రాముడు తదితరులు పాల్గొన్నారు.




