
అంగరంగ వైభవంగా ఫక్రుద్దీన్ బాబా గంధం మహోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, డిసెంబర్ 10, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రం (రహమతాబాద్) లోని పురాతన దర్గా హజ్రత్ సయ్యద్ ఫక్రుద్దీన్ షా వలి “ఉరఫ్” ఫక్రుద్దీన్ బాబా స్వాములవారి గంధ మహోత్సవం మంగళవారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంధమును దర్గా సజ్జాదా సయ్యద్ ఆరిఫ్ హుస్సేన్ ఇంటి నుండి గంధ కలశమును ఆరిఫ్ హుస్సేన్ తనయుడు ఆదిల్ హుస్సేన్ తలపై ఉంచుకొని భక్తి కీర్తనలు ఫకీర్ల జరబులు బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా తీసుకువచ్చి ముందుగా స్థానిక పెద్ద దర్గా ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారికి గంధ లేపనం చేసి అనంతరం ఫక్రుద్దీన్ బాబా దర్గాకు చేర్చారు అక్కడ స్వామి వారి సమాధికి గంధ లేపనం చేసి ప్రత్యేక సలాములు పాడి ప్రార్థనలు చేసి దువా చదివి తదుపరి భక్తులకు గంధ ప్రసాదాలు పంచి పెట్టారు గంధమును తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. గంధ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక దీపాలంకరణ తో పాటు భారీగా అన్నదాన ఏర్పాటు చేశారు.గంధమోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఐ ఏ.సైదులు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.




