ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

వైసీపీ అధినేత జగన్‌కు అసలు ప‌రీక్ష మొద‌లైందా

వైసీపీ అధినేత జగన్‌కు అసలు ప‌రీక్ష మొద‌లైందా..?

 

అమరావతి/ సీమకిరణం న్యూస్:

పాలిటిక్స్, పొలిటికల్ సిచ్యువేషన్స్‌ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు పొలిటికల్ సీన్ మారిపోతూనే ఉంటుంది. ఏపీ లాంటి హైవోల్టేజ్ పాలిటిక్స్ నడిచే రాష్ట్రాల్లో రోజురోజుకు రాజకీయాల్లో మార్పు కనిపిస్తూ వస్తోంది. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్‌ను..సవాళ్లను తట్టుకుని నిలబడటం నాయకులకు అతిపెద్ద టాస్క్‌. ప్రతిపక్షంలో ఉన్న నేతలకు అయితే ఒక యుద్ధమే అని చెప్పాలి. వైసీపీ అధినేత జగన్‌కు ఇలాంటి అసలు ప‌రీక్షలు స్టార్ట్ అవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొని..జైలుకే వెళ్లినా తగ్గకుండా నిలబడిన నాయకుడిగా తమ అధినేతకు ఎలివేషన్ ఇచ్చుకుంటుంటారు ఫ్యాన్ పార్టీ నేతలు. కానీ 2024లో ఓడినప్పటి నుంచి వైసీపీ అధినేత ఫేస్ చేస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఘోర ఓటమి.. మరోవైపు లీడర్ల అరెస్టులు.. ఇంకోవైపు తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తులు.. ఇలా అన్నీ చుట్టుముట్టడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ కాస్త నిరాశ, గందరగోళ పరిస్థితుల్లో ఉంది. నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టీవ్‌గా లేకపోవడం ఒక సమస్య అయితే..మాజీ సీఎం జగన్‌ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడంతో ఇప్పటికీ బౌన్స్‌ బ్యాక్ అవుతామో లేదోనన్న డైలమా వైసీపీ శిబిరంలో కనిపిస్తోందట. మరోవైపు వివేకా హత్య కేసు వెంటాడుతూనే ఉంది. లిక్కర్ స్కామ్‌ కేసు మధనపెడుతోంది. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్, పరకామణి కేసు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న టెన్షన్ అయితే వదలట్లేదు. వైసీపీ అంతర్గతగా ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్న క్రమంలో కూటమి దూకుడు పెంచుతోంది. ప్రత్యేకంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పరంగా సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ..ఇంకోవైపు పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఏపీకి తెచ్చేందుకు ట్రై చేస్తూ..ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.

 

*రెండేళ్ల పాలన పూర్తయ్యే సరికి ఇంకా స్పీడ్‌ పెంచాలని..*

 

అటు పార్టీ పరంగా కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం.. పెండింగ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలా అన్నింటిని క్లియర్‌ చేసి.. రెండేళ్ల పాలన పూర్తయ్యే సరికి ఇంకా స్పీడ్‌ పెంచాలని డిసైడ్ అయ్యారట. బ‌ల‌మైన ఈక్వేష‌న్లు.. సామాజిక వ‌ర్గాలను తమ వెంటే నడిచేలా వ్యూహరచన చేస్తున్నారట. ఇలాంటి సిచ్యువేషన్‌లో అపోజిషన్ వైసీపీ ప‌రిస్థితి ఏంట‌న్నది చ‌ర్చగా మారింది. ఇప్పటికిప్పుడు పార్టీలో మరిన్ని మార్పులు తెస్తారా.? జగన్ తన తీరును ఇంకా మార్చుకుని జనంలోకి వస్తారా.? అనేది ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్‌ మోడ్‌లోకి వెళ్తామంటోంది. ఎన్డీయేకు ఏపీలో కూటమి చాలా ముఖ్యం. రాజకీయంగా వైసీపీ అవసరం అయితే అంతగా ఉండకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్‌తో బీజేపీ పెద్దలకు ఇంటర్నల్‌గా ఉన్న సన్నిహిత సంబంధాలే ఏపీలో కూటమి పెద్దలను కాస్త కలవరపెట్టాయట. లేటెస్ట్‌గా ప్రధాని మోదీ కామెంట్స్‌తో క్లియర్ కట్ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఏపీ ఎంపీలతో మోదీ మాట్లాడుతూ వైసీపీని గట్టిగా టార్గెట్ చేయాలని చెప్పినట్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో వైసీపీ మీద బీజేపీ జాతీయ నాయకత్వమే దూకుడు పెంచడానికి రెడీగా ఉందన్న సంకేతాలు పంపించారని అంటున్నారు. దాంతో బీజేపీ, వైసీపీ చీకటి దోస్తీ అంటూ నడుస్తున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా మోదీ వైసీపీని పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడునున్న పరిస్థితుల్లో దేశంలో పొలిటికల్ ముఖచిత్రం మారుతోంది. దాంతో ఏపీలో కూడా బీజేపీకి ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. వైసీపీని టార్గెట్‌ చేయకపోతే బీజేపీని కూటమి పార్టీలు స్ట్రాంగ్‌గా బిలీవ్‌ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఏపీలో కూటమి పార్టీలకు క్లియర్ కట్ ఇండికేషన్‌ ఇచ్చేందుకే..వైసీపీ విషయంలో బీజేపీ స్ట్రాంగ్‌ రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యిందంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత గేర్‌ మారుస్తారా.? లేక ఇలాగే వెయిట్ అండ్ సీ లైన్‌లోనే ఉంటారా.? అనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!