ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
సీఐ శ్రీరామ్ బదిలీ నిలిపివేయాలి

సీఐ శ్రీరామ్ బదిలీ నిలిపివేయాలి : ఆదోని ప్రజలు
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 16, (సీమకిరణం న్యూస్):
ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరాములు బదిలీపై పట్టణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి అధికారికంగా బదిలీ ఉత్తర్వులు వెలువడడంతో సోమవారం ప్రజలను కలిసివేసింది. నిజాయితీగా పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయడంపై రాజకీయ కుట్ర ఉందన్నారు. సీఐ శ్రీరామ్ వచ్చినప్పుడు నుండి అసాంఘిక దుష్టశక్తులు ఊర్లో అడుగు పెట్టాలన్న భయపడుతున్నారని, సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని బదిలీ నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.




