
2024 ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి దే విజయం
టిడిపి నాయకులు ధర్మారం పెద్ద నాగిరెడ్డి
ప్యాపిలి, జులై 20, (సీమకిరణం న్యూస్) :
2024 ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి విజయం సాధిస్తుందని డోన్ నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని గెలిపించుకుందామని టిడిపి నాయకులు ధర్మారం పెద్ద నాగిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో తొమ్మిదవ వార్డులో ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో ప్రజలకి వివరించారు.
మిని మ్యానిఫెస్ట్ కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఈ రాఘవేంద్ర, చిన్న సుంకయ్య, ఎర్రగుంట పల్లె వెంకటేశ్వర్ రెడ్డి,అంకిరెడ్డి, రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర, సుదర్శన్, ఖాజా పీర్, మల్లికార్జున, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




