
నంద్యాల లో 42 మంది విద్యార్థులకు అస్వస్థత…
మద్యాన భోజనం అనంతరం పిల్లలకు వాంతులు..
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
నంద్యాల ప్రతినిధి, మార్చి 11, (సీమకిరణం న్యూస్) :
నంద్యాలలోని విశ్వనగర్ కాలనిలో గల ప్రభుత్వ ఎలిమెంట్రీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి అయ్యారు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వెంటనే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయ్ కుమార్ కు వీడియో కాల్ చేసి మధ్యాహ్న భోజనం వికటించి అవస్థకు గురైన విద్యార్థులకు ఎటువంటి అపాయం జరగకూడదని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. అదోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
ప్రమాదం ఏమి లేదంటున్న వైద్యులు చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.