ప్రతిభను ప్రోత్సహిస్తేనే రాణింపు..
రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్ మధుసూదన వర్మ
ప్రతిభను ప్రోత్సహిస్తేనే రాణింపు..
రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్ మధుసూదన వర్మ
కర్నూలు టౌన్, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
ప్రతిభా వంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్ మధుసూదన వర్మ అన్నారు. శనివారం నగరంలోని స్థానిక సెయింట్ జోసఫ్స్ కళాశాలలో నూజివీడు సీడ్స్ సౌజన్యంతో ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు లాప్టాప్లను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శాంత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ విచ్చేసి మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక సమస్యలతో సరియైన సాంకేతిక పరికరాలు లేకపోవడంతో వెనుకబడిపోతున్నారని దాతలు సామాజిక బాధ్యతగా తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూజివీడు సీడ్స్ ఎజిఎం నరసింహారెడ్డి మాట్లాడుతూ కార్పోరేట్ సామాజిక బాధ్యతతో పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెయింట్ జోసఫ్స్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరచిన 10 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి లాప్టాప్లను అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ సంస్థ ప్రతినిధులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సివి సత్యనారాయణ, కో ఆర్డినేటర్లు డాక్టర్ కెఎస్ఆర్ చంద్ర శేఖర్ రావు, కె నాగరాజు, జి రవీంద్రనాథ్, ఎస్ లతారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తమ పిల్లలకు ప్రోత్సాహకాలు అందించినందుకు తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.