నష్టాల బాటలో వేలం పాటలు
శిరివెళ్ల, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని మహాదేవపురంలో శనివారం నిర్వహించిన గ్రామపంచాయతీ వేలంపాట నష్టాల బాట పట్టింది. సర్పంచ్ పెద్ది రమణ య్య, ఈఓపిఆర్డి సాల్మన్ రాజు ల అధ్యక్షతన నిర్వహించిన ఈ వేలంపాటలో సుమారు 16 మంది డిపాజిట్లు చేసి వేలం పాటలో పాల్గొన్నారు. పోటా పోటీగా జరగాల్సిన వేలం పాటలు చివరకు పంచాయతీ ఆదాయంపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. గతేడాది ఈ వేలం పాటలో రూ.5.93 లక్షలకు అధిక వేలం పాట దారుడు కైవసం చేసుకోగా, ఈ ఏడాది 5.12 లక్షలు మాత్రమే. అధిక వేలంపాట ముగియడంతో రూ. 81 వేల నష్టం మూటగట్టు కుంది. ఈ వేలంపాటలో వచ్చిన నగదును ప్రభుత్వ ఖజానాకు చెల్లించడం జరుగు తుందని తెలిపారు.గ్రామ సచివాలయ సిబ్బంది, మహా దేవపురం, పచ్చర్ల, గాజులపల్లె గ్రామ ప్రజలు పంచాయతీ వేలంపాటలో పాల్గొన్నారు. గతేడాది కన్నా తక్కువ పాట పాడుకుని అవకాశం ఉంటే వేలం పాటలు వాయిదా వేసి మరోసారి వేలం పాట నిర్వ హించాల్సి ఉంది.అయితే నష్టం వాటిల్లినప్పటికి ఒకేరోజు వేలం పాట ముగించడం పట్ల గ్రామ ప్రజలు తర గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, పలు విధాలుగా చర్చించుకోవడం జరిగింది.