ANDHRABREAKING NEWS
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
దేశ వ్యాప్త సమ్మె కు ఆశ వర్కర్లు మద్దతు..
ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి
ఎమ్మిగనూరు, మార్చి 26, ( సీమకిరణం న్యూస్ ) :
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శివలక్ష్మి, సి ఐ టి యు డివిజన్ కార్యదర్శి బి రాముడు డిమాండ్ చేశారు . శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కార్పొరేట్కరణ వ్యతిరేకంగా 28,29 తేదీలలో జరుప దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగమ్మ నాగమణి శైలజ రాధా మార్తమ్మ మారమ్మ విజయలక్ష్మి గౌరీ సి ఐ టి యు నాయకులు శేషు తదితరులు పాల్గొన్నారు.