మిస్బా ఆత్మహత్య కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ఎం పి జె
పలమనేరులో చదువుల తల్లి మిస్బా ఆత్మహత్య కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ఎం పి జె
ఎమ్మిగనూరు, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు పట్టణంలో మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టిస్ స్థానిక కార్యాలయంలో పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన మిస్బా బ్రహ్మర్షి పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. సోడాలు అమ్ముకునే పేదవాడి కూతురు క్లాసులో చదువులో రాణించడం సహించలేని స్థానిక వైసీపీ నేత సునిల్, ప్రిన్సిపాల్ రమేష్ వివక్షతొ పేద విద్యార్థినిని పొట్టన పెట్టుకోవడం దుర్మార్గం. విద్యార్థిని మరణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
చదువులో పోటీ ఉండాలి కానీ పోటీ పడలేక ద్వేషం పెంచుకోవడం కూతురు పూజితకు సంస్కారం నేర్పించాల్సింది పోయి ఈర్ష్య, ద్వేషాన్ని పెంచి విద్యార్థిని మరణానికి కారణమైన సునిల్ వైఎస్సార్ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా హత్యనేరాన్ని మోపాలని, అతన్ని సహాకరించిన ప్రిన్సిపాల్ రమేష్ ని కూడా ఆ నేరంలో భాగస్వామ్యం చేయాలని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ విద్యర్ధిని, విద్యార్థికి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న మిస్బా కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ కలాం ,అజీమ్ ,అజీజ్ తదితరులు పాల్గొన్నారు.