పాఠశాల ఆదనపు తరగతి గదులకు కొరకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

పాఠశాల ఆదనపు తరగతి గదులకు కొరకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఎర్రకోట
నందవరం, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
నందవరం మండల పరిధిలోని ఇబ్రహీంపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం నాడు నేడు ఫేస్ 2 కింద ఆదనపు గదులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే శనివారం ఆదనపు గదుల నిర్మాణం కోసం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఈ గ్రామంలోని ఉన్నత పాఠశాలకు సంబంధించి నాడు నేడు ఫేస్ 2 కింద ఎన్నికైనదని ,ఈ పాఠశాలకు మౌలిక వసతుల కోసం 73 లక్షలు , 10 అదనపు తరగతుల కోసం 1.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ఈ పాఠశాలలో చేపట్టే పనులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా జరుగుతాయని ఇందులో కాంట్రాక్టర్లు ఉండరని ,కావున గ్రామ పెద్దలు ,ప్రజలు పిసి కమిటీకి సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.పాఠశా లలో చేపట్టే పనులలో
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరగతి గదులు నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అధికారులను ఆదేశించారు. వీరి వెంట మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి , మండల పంచాయతీరాజ్ ఏ ఈ జయన్న , గృహనిర్మాణ శాఖ అధికారి ,ప్రసాద్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మన్న ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవరాజు , సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జ్ఞానేశ్వరి , సీఆర్పీ ఉరుకుందు, మండల వైసీపీ సీనియర్ నాయకులు శివారెడ్డిగౌడ్ , నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు, ముగతి గ్రామ సర్పంచు ముగతి విరుపాక్షిరెడ్డి(ఎంవిఆర్) ,సర్పంచు నాగేశ్వర రెడ్డి, వైసీపీ నాయకులు డీలర్ రాముడు, సక్రప్ప,హోసింగ్ ఏఇలు సచివాలయ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.