అమ్మ ప్రేమ చాటుకున్న వానరం
శిరివెళ్ల, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని ఎర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో వానర శిశువు మృతి చెంది రెండు రోజులు అయినప్పటికీ తల్లి వానరం గ్రామంలోని మసీదు, దర్గా,గుడి గోపురాలలో మృత శిశువును ఎత్తుకు తిరుగుతూ ఉండటం పలువురి హృదయాలను కలచివేసింది. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ, కన్న తల్లి బిడ్డను గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మ నిచ్చిన ప్రేమమూర్తి, ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు.