ఈనెల 31లోగా పెండింగ్ లేకుండా భూసేకరణ పూర్తి చేయండి :-
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-

చెన్నై – సూరత్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ సంబంధించి ఈనెల 31లోగా పెండింగ్ లేకుండా భూసేకరణ పూర్తి చేయండి :-
నేషనల్ హైవే వివిధ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి :-
సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్ , మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
చెన్నై – సూరత్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ సంబంధించి ఈ నెల 31లోగా పెండింగ్ లేకుండా భూసేకరణ పూర్తి చేయాలని కర్నూలు ఆర్డిఓను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చెన్నై – సూరత్ నేషనల్ హైవే 386.51 ఎకరాలకు సంబంధించి భూసేకరణలో 11 గ్రామాలలో పూర్తి చేశామని, ఇంకా దీన్నే దేవరపాడు గ్రామంలో 51.72 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని కర్నూల్ ఆర్ డిఓ జిల్లా కలెక్టర్ కు వివరించగా ఈనెల 31 కల్లా దీన్నే దేవర పాడు గ్రామం సంబంధించి భూసేకరణ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు నుంచి దోర్నాల నేషనల్ హైవే 693.95 ఎకరాలు సంబంధించి భూసేకరణ చేయాల్సి ఉందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర జిల్లా కలెక్టర్ కు వివరించారు. నేషనల్ హైవే భూసేకరణ సంబంధించిన పనులన్నీ వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న నేషనల్ హైవే పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరల్ ఖామర్, కర్నూలు ఆర్ డిఓ హరిప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, తహసీల్దార్ లు, తదితరులు, పాల్గొన్నారు.