తెల్లారిన బతుకులు
రిజర్వాయర్ లో గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం
: అనాధలుగా మారిన చిన్నారులు
వెలుగోడు, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
బ్రతుకు తెరువు కోసం చేపల వేటకు వెళ్లిన దంపతులను ఉహించని విధంగా గాలి, వాన లో చిక్కుకొని మృతి చెందిన ఘటన ఆదివారం మండల కేంద్రమైన వెలుగోడు జలా శయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మండలంలోని వేల్పనూరుకు చెందిన శీలం అంకన్న (30) జయ లక్ష్మి (28)భార్యభర్తలు వెలుగోడులో కాపురం ఉంటు న్నారు. వీరు ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెలుగోడు రిజర్వాయర్ లోకి వెళ్లారు. సాయంత్రం సుమారు 3.45 గంటలకు వచ్చిన గాలి వాన వలన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. సోమవారం ఉదయం నుంచి తహశీల్దార్ శ్రీనివాసులు , ఎస్.ఐ జగన్ మోహన్ ల అధ్వర్యంలో గాలిం పు చర్యలు చేపట్టారు. ఎట్ట కేలకు సాయంత్రానికి శీలం జయలక్ష్మి, అంకన్నల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు సంతానం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.