ఎల్ఐసి పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలి
ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు విజయ్ కుమార్, రఘునాథ్ గౌడ్
– కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిబ్బంది
ధర్నా నిర్వహిస్తున్న ఎల్ఐసి ఉద్యోగులు
ఎమ్మిగనూరు, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
ఎల్ఐసి పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు విజయ్ కుమార్ రఘునాథ్ గౌడ్ తెలిపారు. సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎల్ఐసి కార్యాలయం ముందు స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి లిఫ్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమార్చి 28 సమ్మెలో భాగంగా విధులు బహిష్కరణ చేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కార్పొరేట్, విదేశీ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. కేవలం తన బడ్జెట్ లోటును పూడ్చునేందుకు ఎల్ఐసి ఐపిఓ ను తీసుకురావాలని ప్రభుత్వం అనుకోవడం అన్యాయమని అన్నారు. పాలసీదారులు బీమా ప్రీమియం లపై జిఎస్టి తొలగించాలని కోరుకుంటున్నారని, ఆ విషయం ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ సిబ్బందికి వేతన సవరణ చేపట్టాలని, బీమా రంగ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెన్షన్ అప్ డేషన్ చేయాలని, ఫ్యామిలీ పెన్షన్ పెంచాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నూతన కార్మిక కోడ్ లను ఉపసంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేశ్వర్లు శంకర్ ధర్మరాజు మల్లికార్జున అమ్రేషప్ప రాము హంపయ్య వెంకటేష్ క్రాంతి కుమార్ వినయ్ బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు