BREAKING NEWSPOLITICSSTATE
కార్మిక, కర్షక లోకాన్ని కాపాడుకుంద్దాం – సిఐటియు
కార్మిక, కర్షక లోకాన్ని కాపాడుకుంద్దాం – సిఐటియు
నందవరం, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
నందవరం మండల కేంద్రంలోని స్థానిక కెనరా బ్యాంక్ నుండి పాత బస్టాండ్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో సీఐటీయూ మండల నాయకురాలు అరుణ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు గురు గురు శేఖర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నందవరంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు హాని కలిగించే 4 లేబర్ కోర్టులు తీసుకువచ్చి కార్మిక హక్కులకు కోరలు పీకేసిందని ఆరోపించారు. యావత్ భారత దేశ వ్యాప్తంగా కార్మికులు సోమవారం సమ్మెలో పాల్గొని తమ నిరసన గళాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని, చిరుద్యోగులు అందరికీ కనీస వేతనాలు రూ.27 వేలు ఇవ్వాలని, చిరుద్యోగులులకు సంక్షేమ పథకాలను అమలుచేసి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. నలభై నాలుగు రకాల కార్మిక హక్కులను రద్దు చేసి, నాలుగు కోడ్స్ తీసుకువచ్చిన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం, తక్షణమే కార్మిక కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రములో ఆశలు, అంగనివాడిలకు నవ రత్నాలు అమలు చేయడం లేదని, నవరత్నాలు ఇవ్వలేక పోతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సోమేశ్వర రెడ్డి, కెవిపియస్ మండల అధ్యక్షులు రాజు, సిఐటియు నాయకులు ఎల్లేష్, అంగనివాడి నాయకురాలు కృపమ్మ, తులసిమ్మ, హేమలత, వెంకటేశ్వరమ్మ, సాహి మున్నిసా, సరస్వతమ్మ, రేణుక, రాధ, గాయత్రి, మణి, సుబ్బమ్మ, భాగ్యమ్మ, లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి, హరితమ్మ, కుమిదిని, హసీనా, ఆశ వర్కర్లు శారదా, ఇందిరా, జ్యోతి, నాగ లక్ష్మీ, నాగవేణి, గిరిజా తదితరులు పాల్గొన్నారు.