
ఎమ్మిగనూరులో సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న ఉద్యోగులు
ఎమ్మిగనూరు, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు తాలూకా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎమ్మిగనూరు లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో భాగంగా మొదటి రోజు ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక సంఘాలు పాల్గొని మండల కార్యాలయం ఆవరణ నుండీ సోమప్ప సర్కిల్, వైఎస్సార్ సర్కిల్ మీదుగా పోస్టాఫీస్,వాల్మీకి సర్కిల్ మీదుగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి విజయ వంతం చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దుచేయాలని, పాత చట్టాలను పునరుద్ధరణ చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని, ఆదాయపన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు6 నెలల పాటు నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలని, ఆటో,భవనం,హమాలీ,లారీ డ్రైవర్ లకు లాక్ డౌన్ కాలానికి నెలకు 10వేల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశా,వెలుగు, ఉపాధిహామీ,సమగ్ర శిక్ష అభియాన్ తదితర స్కీం వర్కర్లందరిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, ఇతర సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు
చేయాలని డిమాండ్ చేశారు.
చేయాలని డిమాండ్ చేశారు.