MOVIES
ఎమ్మిగనూరులో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు పట్టణంలో తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన,అనంతరం స్థానిక శివ ప్రియ టాకీస్ నందు కేక్ కటింగ్ చేసి 101 గుమ్మడి కాయ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్ ,కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ మెగా అభిమానుల మధ్య అభిమాన హీరో రామచంద్ర గారి పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమాలు రామ్ చరణ్ నటన అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ, త్రిబుల్ ఆర్ సినిమా తో తెలుగువారి సత్తాని దేశం నలుమూలల చాటారని కొనియాడారు. ఇకపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ సాధిస్తూ, దేవుడు ఒక ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అభిమాన హీరో పై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గురు చైతన్య గిరి గోవర్ధన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.