నిత్యావసర దుకాణాలపై విజిలెన్స్ దాడులు…
ఆళ్లగడ్డ, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :
ఆళ్లగడ్డ తో పాటు శిరివెళ్ళ, రుద్రవరం మండల పరిధిలోని కొండ మాయ పల్లిలోని నిత్యా వసర సరుకుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డిఎస్పి సుధాకర్ రెడ్డి, సీఐ శ్రీధర్ ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అధిక ధరలకు పామాయిల్, సన్ ఫ్లవర్, ఇతర నూనెలు అమ్ముతున్నారని సమాచారంతో బుధవారం దాడులు నిర్వహించారు. న్యూ గణేష్ జనరల్ స్టోర్, వెంకట రమణ దుకాణాలపై దాడులు నిర్వహించి నిర్ణీత ధర కంటే అధిక ధరలకు అమ్మతుండడం తో గణేష్ జనరల్ స్టోర్ వారికి విజిలెన్స్ అధికారులు రూ.10 వేలు, వెంకటరమణ దుకాణ దారుడికి రూ.4 వేలు జరి మానా విధించారు. ఈ సంద ర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని సాకుగా తీసుకొని కొందరు ఆయిల్ ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని సమా చారం రావడంతో జిల్లా విలేజ్ ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దయ్య, రుపస్ తదితరులు పాల్గొన్నారు.