ANDHRABREAKING NEWSSTATE
వార్డులోని ప్రజలకు ఉత్తమ సేవలందించాలి
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
ఆకస్మికంగా వార్డు సచివాలయాలు తనిఖీ :-
వార్డులోని ప్రజలకు ఉత్తమ సేవలందించాలి :-
సచివాలయం సందర్శించే వారితో గౌరవంతో వ్యవహరించాలి :-
ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించండి :-
సచివాలయ సిబ్బందికి ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు టౌన్ , మార్చి 29, ( సీమకిరణం న్యూస్) :
సచివాలయం పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు సిబ్బంది, వలంటీర్లు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని లక్ష్మీ నగర్ వార్డు సచివాలయం – 2 మరియు జె.ఎన్.ఆర్ నగర్ వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను సావధానంగా విని తమ పరిధిలో వుంటే తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, లేనిపక్షంలో పై అధికారులకు నివేదించి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్డు పరిధిలో ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి స్కానింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పెండింగ్ లేకుండా పూర్తి చేసి దస్తావేజులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.