మర్రిపాడులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మర్రిపాడు మండల కేంద్రంలో అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం
మర్రిపాడు, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
టీడీపీ’పార్టీ పురుడు పోసుకున్న రోజు సందర్బంగా మర్రిపాడు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నందు మంగళవారం “ఉదయం 9గంటలకు” పార్టీ జండా ఆవిష్కరణ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య అట్టహాసంగా నిర్వహించారు మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాలు ఎక్కువ సంఖ్యలో పాల్గోని జండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మండల సీనియర్ నాయకులు పావులూరి వెంకటరమణయ్య ,గాలిబోయిన లక్ష్మి నరసయ్య మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్పూర్తితో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కిలో బియ్యం రెండు రూపాయలు, పక్కా గృహ నిర్మాణాలు సగం ధరకే చీర దోవతి అనే పథకాలు అనౌన్స్ చేసి చైతన్య రథం లో ప్రయాణించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీ ప్రజాక్షేత్రంలో ఉంటూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 70 లక్షల మంది కార్యకర్తలతో ఉన్న టీడీపీ దేశంలోనే ప్రధమ రాజకీయ పార్టీగా నిలిచింది.దిక్కు దివానం లేని విభజిత రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని సంపూర్ణ రాజధానిగా అమరావతి ని రూపొందించడమే టీడీపీ అవశ్యకతతో ముందుకు సాగే టీడీపీ ప్రతి కార్యకర్త బాధ్యతతో ముందుకు సాగుతున్నారని, రాష్ట్ర ప్రగతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. జై ఎన్టీఆర్,జై చంద్రబాబు నినాదాలతో టీడీపీ నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మర్రిపాడు సెంటర్ ను హోరెత్తించారు రబోయేది టిడిపి ప్రభుత్వ మే నని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.