కేంద్ర ప్రభుత్వంది కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది..
కార్మిక సంఘం సమ్మెలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, తెరాస జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి.
జనగామ, మార్చి 29, ( సీమకిరణం న్యూస్) :
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉద్యోగ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రిస్టిన్ కళాశాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మిక సంఘాల కు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగామారి, ప్రభుత్వ రంగ సంస్థలనూ పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు.