BREAKING NEWSPOLITICSSTATE
డిజిపి ని కలిసిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి ని కలిసిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు టౌన్, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
చిత్తూరు జిల్లా పలమనేరు విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మిస్బా కుటుంబానికి ఖచ్చితమైన న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలియజేశారు.సాంఘిక ప్రసార మాధ్యమంలో వచ్చే కొన్ని అసాంఘిక అవాస్తవాలని ప్రజలు నమ్మవద్దని తెలియజేశారు. మిస్బా విద్యార్థి లాంటి ఇంకో విద్యార్థికి ఇలాంటి పరిస్థితి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలకు కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.