డోన్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
డోన్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
డోన్ టౌన్, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
కీ,,శే,, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 40 సంవత్సరాలు ఆయన సందర్భంగా. జాతీయ టిడిపి అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పట్టణంలో సాయి ఫంక్షన్ హాల్ నందు డోన్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ దర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. అదేవిధంగా పట్టణములో టిడిపి కార్యకర్తలు నాయకులతో బైక్ రాల్యీని మార్కెట్ యార్డ్ నుండి పాతబస్టాండు మీదుగా సాయి ఫంక్షన్ హాల్ చేరుకొని . నందమూరి తారకరామారావు విగ్రహమునకు పూల మాల వేసి నివాళులు అర్పించి నందమూరి తారక రామారావుని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆసరాగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల వారిని ఎందరినో మంత్రులను ఎమ్మెల్యేలను స్పీకర్లను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని తెలిపారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుక వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని, అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు సారథ్యంలో డోన్ నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త నాయకులు సాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డోన్ లో ఇసుక మాఫియా, మట్కా మాఫియా నడుస్తుందని తెలిపారు. బేతంచెర్ల లో ఆయిల్ మాఫియా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గంలోని సీనియర్ టిడిపి నాయకులను పట్టణాధ్యక్షుడు సీఎం శీను సహకారంతో నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ యువ నాయకులు మన్నె గౌతంరెడ్డి , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ , మాజీ ఎంపిపి R.E.రాఘవేంద్ర , మాజీ చేర్మేన్ మార్కెట్ యార్డ్ మురళీకృష్ణ గౌడ్ ,నంద్యాల పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి విజయ్ భట్ ,మాజీ జట్పిటిసి లక్ష్మీదేవి , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ తెలుగుయువత ఉపాధ్యక్షులు తమ్మినేని రాజశేఖర్ నాయుడు , మాజీ ఎంపిపి వెంకట నారాయణ ,చండ్రపల్లె లక్ష్మీనారాయణ యాదవ్ , తిమ్మయ్య యాదవ్ , మండలం టిడిపి అద్యక్షులు చాటకొండ శ్రీనివాసులు యాదవ్ , ప్యాపిలి మండలం టిడిపి అద్యక్షులు గండికోట రామసుబ్బయ్య గారు,కమలాపురం రాంమోహన్ రెడ్డి ,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ SC మెంబర్ గంధం శ్రీనివాసులు , అడ్వకేట్ మల్లికార్జున ,నంద్యాల పార్లమెంట్ టిడిపి బిసి సెల్ అద్యక్షులు ప్రజావైద్యశాల మల్లికార్జున ,నంద్యాల పార్లమెంట్ టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవింద ,కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి , అడ్వకేట్ ఆంజనేయులు గౌడ్ , నంద్యాల పార్లమెంట్ మైనార్టీ ప్రదాన కార్యదర్శి ఖాజాపీరా ,పెద్దపూదేళ్ళ ప్రసాద్ రెడ్డి , ఎర్రగుట్లపల్లె వేంకటేశ్వర రెడ్డి , బావి పల్లె లింగన్న , నంద్యాల పార్లమెంట్ టిడిపి కార్యదర్శి అలేబాద్ పరమేశ్వరుడు , డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగుయువత అద్యక్షులు కుమ్మరి సుధాకర్ ,డోన్ మండలం టిడిపి ఉపాధ్యక్షులు మిద్దపల్లె గోవిందు ,డోన్ పట్టణ ఉపాధ్యక్షులు మర్రి ఉపేంద్ర గా తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.