
2024 లో టిడిపి దే విజయం
100 నుండి 140 స్థానాలు గెలుస్తాం
టిడిపి రాష్ట్ర సెక్రటరీ దావా పెంచల రావు
ఆత్మకూరు ,సంగం,మార్చి 29, (సీమకిరణం న్యూస్ )
2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ,రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని రాష్ట్ర టిడిపి సెక్రెటరీ దావా పెంచల రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా సిద్ది పురం ,సంఘం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో మంగళవారం పాల్గొన్నారు.అనంతరం టిడిపి పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం దావా పెంచల రావు మీడియాతో మాట్లాడుతూ 2024లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.145 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టిడిపి జెండాను ఎగరవేశారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కూడు ,గుడ్డ,గూడు,నీనాదంతో పార్టీ స్థాపించిన 9 నెలలకి అధికారంలోకి వచ్చిందని తెలియజేశారు.రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి నాయకులు కొర్రపాటి మంజుల,జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి బానా శ్రీనివాస్ రెడ్డి,టిడిపి మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్,ఎస్ కే బాబు,తదితరులు పాల్గొన్నారు.