TELANGANA
దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి దొమ్మాటి

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి దొమ్మాటి
జిల్లా నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి
జనగామ , మార్చి 29, (సీమకిరణం న్యూస్ )
జిల్లాలోని దేవర్పుల మండలంలోని ధర్మపురం గ్రామంలో నిర్వహించిన దుర్గ మాత ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్మండల అధ్యక్షులు గండిపె ళ్లి. యాకయ్య ఆహ్వానం మేరకు మoగళవారం వరంగల్ పార్లమెంట్ సభ్యులు దొమ్మాటి.సాంబయ్య పాల్గోనడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల గ్రామాల్లో ప్రజలు ఎటువంటి పండుగలను జరుపుకోలేదని అన్నారు. ఈ సంవత్సరం థర్డ్ వే కరోనా’పూర్తిగా తగ్గు ముఖం పడేసరికి ఆయా గ్రామాల్లో దుర్గా మాత, ఎల్లమ్మ, మైసమ్మ, తదితర పండుగలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్ నారని అన్నారు. అందులో భాగంగానే దేవరుప్పుల మండలం, ధర్మాపురం గ్రామంలోరెండురోజులపాటుదుర్గామా త ఉత్సవాలు’ జరుపుకొనగా ‘కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు గండిపెళ్లి యాకయ్య’ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పాల్గొన్నారని ఠెలిపారు. ఆయనతో పాటు పిసిసి కార్యదర్శి బొజ్జ సమ్మయ్య,డిసిసి కార్యదర్శి రాంమూర్తి,డిసిసి జిల్లా సెక్రటరీ కాసారపు ధర్మారెడ్డి,జిల్లా బిసిసెల్ అధ్యక్షుడు కాసాని ఎర్రయ్య, ,మండల నాయకులుతోటకూరిరమేష్,హరియా నాయక్,తదితరులు పాల్గొన్నారు.