TELANGANA
కేసీఆర్ పాలనలో ప్రగతి పథంలో గ్రామాలు
కేసీఆర్ పాలనలో ప్రగతి పథంలో గ్రామాలు
– నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం చిట్యాల మండలంలోని సుంకెనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం భవనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ లు ప్రారంభోత్సవం, అలాగే రూ. 30లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గుండ్రాంపల్లి, వనిపాకల గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికికాల్వలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అమలుచేస్తు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు అందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా భరోసా ఇచ్చారని తెలిపారు. గుండ్రంపల్లి నుండి సుంకెనపల్లి మీదుగా వెల్లంకి వరకు రోడ్డు మరమ్మతు పనులకు కోటి 35 లక్షలు, సుంకెనపల్లి – జైకేసారం రోడ్డు మరమ్మతు పనులకు రూ. 11 లక్షల నిధులు మంజూరయ్యాయని, ఈ పనులను టెండర్ ప్రక్రియ పూర్తవగానే ప్రారంభిస్తామన్నారు. అలాగే సుంకెనపల్లి గ్రామంలో లారీ డ్రైవర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులను దశలవారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు కక్కిరేణి బొందయ్య, రత్నం పుష్పమ్మనర్సింహా, మేడి లింగమ్మనర్సింహా, ఎంపీడీఓ లాజర్, ఎంపీఓ పద్మ, ఏఈ శంకర్ బాబు, ఉపసర్పంచ్ బాతరాజు రవీందర్, సింగిల్విండో వైస్ చైర్మన్ ఆవుల నాగరాజు, తెరాస మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, ప్రధానకార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పంతంగి మధనాచారి, మారగోని శివశంకర్ గౌడ్, పిట్టంపల్లి, పెద్దకాపర్తి సర్పంచ్ వీసం బాబు, మర్రి జలెంధర్ రెడ్డి, ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, నాయకులు జనగాం నర్సింహా గౌడ్, పాలెం మల్లేష్ గౌడ్, యాకారి నరేందర్, బల్గూరి సైదులు, ఆవుల సునీత, కోయగూర నర్సింహా, చెరుకు మధుసూధన్,ఆవుల రుకునమ్మ, బాతరాజు రమేష్, యాకారి మత్స్యగిరి,అంబాల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.