ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
నందవరం, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
నందవరం మండలం ముగతి గ్రామంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ముగతి గ్రామం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామం మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పెద్దలు, మాజీ జడ్పిటిసి సభ్యులు ఈరన్నగౌడ్ ఒక ముఖ్యమైన పని మీద ఉండడం వలన ఈ కార్యక్రమానికి రాలేదన్నారు. ఆనాడు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరంకుశత్వంను, అరాచకంను నియంత్రించేందుకు పాలకుల నుండి ప్రజలను రక్షించేందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో 29-03-1982 న తెలుగుదేశం పార్టీ నీ స్థాపించారు. నేటికీ పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తి అయ్యాయి అని, ఆనాడు దేశంలోనే ఒక కొత్త శకానికి నాంది పలికారు ప్రజలేదేవుళ్ళు – సమాజమే దేవాలయం అని మనస్ఫూర్తిగా నమ్మి పార్టీనీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ ముందుగా తెలుగు ఆడబిడ్డల సంసారంలో వెలుగులు నింపే విధంగా మద్యనిషేధం అమలు చేశారున్నారు మరి నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఈ మూడేళ్లలో చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్న చందంగా తయారైంది అని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిన అధికారం లో ఉన్న నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదు అని అన్నారు, అప్పులు తెచ్చి డబ్బులు వేసి మళ్లీ మనమీద భారం వేసి వివిధ రకాల పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు పెట్రోలు, డీజిల్, గ్యాస్, మంచి నూనె ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత జీవితం అస్తవ్యస్తంగా ఉంది అన్నారు ఎవరూ అడిగారు అని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచారు అని పక్క రాష్ట్రంలో 58 ఏళ్లు ఉంటే ఇక్కడ మాత్రం వయసు పెంచి ఇంకా నిరుద్యోగం పెరిగేoదుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కారకులు అయ్యారు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ బాలరాజు,బోయ నరసింహులు, గొల్ల తాయన్న, అల్లుడు అర్జున్, బోయ దస్తగిరి, తులసిరామ్ రెడ్డి,ఈడిగ రాజు, కొండయ్య, గడ్డ మీద నరసింహుడు, ఈడిగ వెంకటేష్, టైలర్ సోమేష్, ధనుoజయరెడ్డి, ఈరన్న, శ్రీను, రమేష్, నరసన్న, శేఖర్, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.