జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేయండి
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
నంద్యాలలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేయండి :-
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో నంద్యాల జిల్లా ఏర్పాటుకు సంబంధించి జిల్లా కార్యాలయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, పనుల పురోగతిపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతన జిల్లాగా ఏర్పాటైన నంద్యాలలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో పాటు ఫర్నిచర్ ను తరలించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉగాది నాటి నుంచి కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా ఈ రోజు, రేపటి లోపు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు . సమకూర్చుకోవాలని అన్నారు. . జిల్లా కార్యాలయలకు నేమ్ బోర్డులను సిద్ధం చేసి ప్రదర్శించాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.