ANDHRABREAKING NEWSPOLITICSSTATE
జగనన్న పాలనలో విద్యకు పెద్దపీట
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
జగనన్న పాలనలో విద్యకు పెద్దపీట
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామంలో రూ. 1.80 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలు నిర్మాణం, అలాగే మౌలిక వసతులు 63 లక్షలు నిధులతో నిర్మించనున్న భవనాలకు భూమి పూజ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారి చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మన జగనన్న పాలనలో విద్యకు పెద్దపీట వేశారని కావున ప్రతి విద్యార్థిని విద్యార్థి చదువు కోవడానికి ప్రభుత్వ పాఠశాలలను నాడు- నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించి. అక్కడి కంటే ఉన్నతమైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు పారదర్శకంగా ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా నేరుగా అకౌంట్లోకి జమచేసున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్ గారికి దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన్సూర్, బందె నవాజ్, భాస్కర్ రెడ్డి, వేముగోడ నరేష్ రెడ్డి, సత్యన స్వామి, వెంకట సాయినాథ్, కాశీరెడ్డి, గిడ్డయ్య, ఎంపీడీవో ప్రవీణ్, గోనెగండ్ల తహశీల్దార్ వేణుగోపాల్ శర్మ, RWS డి ఈ శ్రీనివాస్ రెడ్డి, దొరబాబు, మాబు, రంగముని, నరసన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.