ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు
ప్రతి డివిజన్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ / వరంగల్, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట 63 వ డివిజన్ పరిధిలో గల 7వ బ్లాక్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి హజరై ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు
నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ పేరు మీద వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక డివిజన్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మహిళలు స్వశక్తితో ఎదిగి తమ కాళ్ళపై తాము నిలబడటానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఎంతో తోడ్పడుతుంది. మహిళలు స్వచ్చందంగా ముందుకు వస్తే నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పోగుల సంతోష్ , ఆరూరి సాంబయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అద్యక్షుడు మహమ్మద్ ముస్తాక్ నేహళ్, గొర్రె సంజీవ్ , బొడ్డు సదానంద, బొడ్డు కుమార స్వామి, గండికోట వీరయ్య, కాసు ఇన్నరెడ్డి పాలడుగుల అంజి , బొడ్డ లింగ, ఉపేందర్, కమల,శోభ,కడారి రేణుక కడారి మౌనిక,పులిపాక అన్నపూర్ణ, బొడ్డు రాజమణి,గొర్రె రజిత,గొర్రె పద్మ, గౌని స్రవంతి, శనిగరపు సరిత, శనిగరపు సంద్య,జుపాక అనుష,మౌనిక, మరియు తదితరులు పాల్గొన్నారు..