నూర్ అహ్మద్ మృతి మోటార్ వర్కర్స్ యూనియన్ కు తీరని లోటు
నూర్ అహ్మద్ మృతి మోటార్ వర్కర్స్ యూనియన్ కు తీరని లోటు : సిఐటియు
ఆత్మకూరు, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు పట్టణంలో లారీ డ్రైవర్ గా వృత్తి చేసుకుంటూ మోటార్ వర్కర్స్ యూనియన్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ బైరాపురం నూర్ అహ్మద్ అని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, జిల్లా కార్యదర్శి ఏ రణధీర్, మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కలీముల్లా, కార్యదర్శి బి ఎస్. వలి లు అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక డాక్టర్ ధనుంజయ మీటింగ్ హాల్ నందు బైరాపురం నూర్ అహ్మద్ మృతి సందర్భంగా సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూర్ అహ్మద్ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో సీఐటీయూ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించారన్నారు. జీతాలు పెంపు సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి దాంట్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. అలాగే ఇతర సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. ఆయన మృతి మోటార్ వర్కర్స్ ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్, కార్యదర్శి రామ్ నాయక్, సిఐటియు నాయకులు యాసిమియా, ఖాదర్ భాషా, హిదాయత్, మహబూబ్ బాషా, మున్వర్, సురేంద్ర, శివ కుమార్, మహమ్మద్, రవి, గోపాల్, స్వాములు తదితరులు పాల్గొన్నారు.