TELANGANA
జాతరలో మంచినీటి వితరణ కేంద్రం ప్రారంభం
భక్తుల సౌకర్యార్థం జాతరలో మంచినీటి వితరణ కేంద్రం ప్రారంభం
చిట్యాల, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కీ.శే మిద్దెల రాములు గౌడ్ – సత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు అఖిల భారత గౌడ సంఘం జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, మిద్దెల యాదగిరి గౌడ్ ల సహకారంతో గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో పెద్ద రథోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి వితరణ కేంద్రాన్ని చిట్యాల ఎస్ఐ సైదాబాబు చేతుల మీదుగా సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండో చైర్మన్ రాచకొండ కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ బండ కిష్టయ్య, తెరస నాయకులు రత్నం నర్సింహా, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు మారగోని శివశంకర్, మాజీ దేవాలయ చైర్మన్ గోపగోని నర్సింహా, మహ్మద్ అప్జల్, పానుగుళ్ళ వెంకటేశం, రెడపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.