TELANGANA
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానం
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని జడ్పీలో తీర్మానం..
జడ్పీఛైర్మెన్, పాగాల సంపత్ రెడ్డి
జనగామ, మార్చి 30, (సీమకిరణం న్యూస్) ;
జిల్లా పరిషత్ కార్యాలయం నందు జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పండిన రబీ వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కోనుగోలు చెయ్యాలని గౌరవ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూవ్యవసాయబావులపంపు సెట్లకు మీటర్లు బిగించరాదనిఏకగ్రీవం గా తీర్మానించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిషత్ అత్యవసర సమావేశంలో చేసిన తీర్మానాలపై తెలిపారు.
1. మా జనగామ జిల్లాలోని రైతులు యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలుచేయాలన్నారు.
2.గిరిజనుల కోసం 10 శాతం రిజర్వే షన్లు పెంపు బిల్లును ఆమోదించి చట్టం తేవాలన్నారు.
3. పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలనిమండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయడం జరిగిం దన్నారు.ఈ సర్వసభ్య సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్సీ కడియంశ్రీహరి, జనగామఎమ్మెల్యేముత్తిరెడ్డియా దగిరి రెడ్డి,,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, జిల్లా రైతు బంధు అధ్యక్షులు రమణ రెడ్డి, అదనపు కలెక్టర్ హమీద్, జెడ్పీ సిఇఓ విజయ లక్ష్మి,జెడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, జిల్లా జెడ్పీటీసీలు, ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.