రసవత్తరంగా సాగిన సర్వసభ్య సమావేశం
రసవత్తరంగా సాగిన సర్వసభ్య సమావేశం
ఆదోని, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
పట్టణాలకు నగరాలకు పట్టుకొమ్మలైన పల్లెల్లో నెల కొన్న సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధుల సర్వసభ్య సమా వేశంలో అధికారులను నిలదీ శారు. బుధవారం మండల ప్రజా పరిషత్ సమావేశ భవనం లో మండల పరిషత్ అధ్యక్షు రాలు దానమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆస్తులు కూడబెట్టండి అని అడగరని తాగునీరు,విద్యుత్, విద్య, వైద్యం, పారిశుధ్యంపై సమస్యలు పరిష్కరిస్తే సంపూర్ణమైన పాలనగా ప్రజలు అభిప్రాయపడతారన్నారు. అర్ధరాత్రి వేళలో విద్యుత్ కోతలు విధించడంతో బాలిం తలు,వృద్దులు, వికలాంగులు వేసవి కాలంలో వేడి చిదిమే స్తుంటే చెమటలు చిందిస్తూ ఉండడంతో నిద్ర పట్టక అనారోగ్యాల పాలవుతున్నా రని దొడ్డనకేరి సర్పంచ్ పార్వ తమ్మ, బైచిగేరి సర్పంచ్ మహాదేవ,పెద్ద హరివాణం సర్పంచ్ రాముడు అధికారు లను నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎందుకు మంజూరు చేయడం లేదని గోనభావి సర్పంచ్ మహమ్మద్ అలీ అధికారులను ప్రశ్నించారు.ఇల్లు నిర్మించు కోవాలనుకునేవారు గ్రామ సచివాలయాలు దరఖాస్తు చేసుకుని ఆ జాబితాను తమకు అందజేయాలని సంబంధిత అధికారులు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జరుగుతుందని ఎంపీడీవో గీతా వాణి సభ్యులకు వివరించారు సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు అస్లాం ఖాద్రి మండల కో ఆప్షన్ సభ్యులు వాది రాజ్ ఈవో ఆర్ డి జనార్ధన్ విద్యాశాఖ అధికారి శివరాములు ఏపీవో లు చక్రవర్తి చంద్రశేఖర్ ర్ సి డి పి ఓ ఉమా మహేశ్వర్ మ్మ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్య పంచాయతీ రాజ్ ఏ ఈ మాలిక్ భాష ఆర్టికల్చర్ అధికారి హరిద్ర ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మి మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.