2న ఉగాది పంచాంగ శ్రవణం
2న ఉగాది పంచాంగ శ్రవణం
కర్నూలు టౌన్, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నగరంలోని శ్రీ శ్రీనివాస మందిరంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కృష్ణ మోహన శర్మచే ఉగాది పంచాంగ శ్రవణం,కందకవి రాధశ్రీచే ఉగాది విశిష్టతపై ధార్మిక ప్రవచనం, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు.బుధవారం స్థానిక శ్రీ శ్రీనివాస మందిరంలో పీఠాధిపతులు శ్రీ యల్లప్ప స్వామి, శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, ఇస్కాన్ కర్నూలు జిల్లా ప్రచారకులు శ్రీ భక్త రామదాసు ప్రభుజీ, బజరంగదళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాప్ రెడ్డి, శ్రీ శ్రీనివాస మందిరం కమిటీ అధ్యక్షులు దారం అనంత పద్మనాభ రెడ్డిలతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్3 నుండి 9వరకు 7 రోజులపాటు కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ పండితులచే శ్రీమద్రామాయణం లోని వివిధ అంశాలపై ధార్మిక ప్రవచనాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భీమారావు, కార్యదర్శి లక్ష్మయ్య, కోశాధికారి జి.రమేశ్, ఎల్ఐసి విశ్రాంత అధికారిణి శైలజ, వైద్యం రామానాయుడు, కామధేను గోశాల వ్యవస్థాపకులు బలిజ శ్రీరాములు, శ్రీవారి మాతృ మండలి సభ్యులు బి.నాగమల్లీశ్వరి, లలితా, విజయలక్ష్మి, కృష్ణవేణి, సుభాషిణి, ఉమాదేవితో పాటు వివిధ ధార్మిక సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.