కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు….
పాణ్యం, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవ సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు కానుకలుగా సమర్పిం చిన వచ్చిన హుండీ ఆదాయా న్ని బుధవారం గ్రామ పెద్దల పర్యవేక్షణలో లెక్కింపు కార్య క్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. 2022 జనవరి 17 నుండి మార్చి 30 వరకు వచ్చిన కానుకలను లెక్కింప గా సుమారు 18,85,104 లు ఆదాయం వచ్చిందన్నారు. 9 గ్రాముల బంగారం,1.700 కేజీల వెండి కానుకలుగా వచ్చాయన్నారు. 2నెలల 13 రోజులకు భక్తులు సమర్పించ గా వచ్చిన ఆదాయం ఇది రెండోసారని ఆయన వెల్ల డించారు. లెక్కింపు కార్యక్రమం లో సుబ్రమణ్యం నాయుడు, ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకుడు మామిదాలపాడు మరియు గ్రామ పెద్దలు కృష్ణా రెడ్డి, శివరామిరెడ్డి ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాద్, బంగారయ్య స్వచ్ఛంద సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.