ఇవి తాగునీరే కదా..?
నంద్యాల టౌన్, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
గత వారం రోజులుగా నంద్యాల పట్టణ ప్రాంతంలో తాగునీరు రంగు మారి దుర్వాసనతో వస్తుందని మునిసిపల్ కమిషనర్ వెంకట కృష్ణకు ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ వారం రోజులుగా తాగు నీరు రంగు మారి దుర్వాసన వస్తుందని, కొన్ని వార్డుల్లో పురుగులు కూడా వస్తున్నా యన్నారు. నీరు ఇలా రావడం వల్ల పట్టణ ప్రజలు వాంతులు, విరేచనాలతో రోగాల పాలవుతున్నారని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో నీటి సమస్య ఉండకూడదని అమృ త పథకం ప్రారంభించినప్పటికీ కూడా ఇలాంటి నీటి సమస్యలు పునరావృతం కావడం చాలా దారుణమన్నారు.