
ఆస్పరి ఎస్సై గా వరప్రసాద్
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
ఆస్పరి ఎస్సై వరప్రసాద్
ఆస్పరి, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
ఆస్పరి ఎస్సైగా యు.వి. వర ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆత్మకూరు పోలీ స్ స్టేషన్ లో విధులు
నిర్వహిస్తున్న ఆయన ఆస్పరి ఎస్సై గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆత్మ కూరు, పాములపాడు, ఆళ్లగడ్డ పీఎస్ లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆస్పరి ఎస్సైగా పనిచేస్తున్న ముని ప్రతాప్ విఆర్ కు వెళ్లడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్సై వరప్రసాద్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. మండలంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే అన్ని గ్రామాల్లో పోలీసు భద్రత పటిష్టంగా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. అసాంఘిక కార్య క్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.