
అలివి వలల నియంత్రణకు ప్రత్యేక కమిటీ : ఆర్డీవో చైత్ర వర్షిని
నెల్లూరు, ఆత్మకూరు, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :
సోమశిల జలాశయం వద్ద శుక్రవారం నుండి జరుగుతున్న అలివి వలల వివాదంపై శనివారం ఆత్మకూరు పట్టణంలో డిఎస్పి కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీవో ఏ.చైత్రవర్షిని అధ్యక్షతన నిన్న జలాశయం వద్ద గందరగోళం చోటు చేసుకున్న విషయంపై ఇరువర్గాలను మరియు జలాశయానికి అనుబంధంగా ఉండే ఏడు శాఖల అధికారుల తో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో నెల్లూరు ఫిషరీ జె.డి నాగేశ్వరరావు ఆత్మకూరు డిఎస్పి కె. వెంకటేశ్వరరావు సీఐ జి.వేణుగోపాల్ రెడ్డి అనంతసాగరం తాహసిల్దార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుండి ఇతర అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సోమశిల జలాశయం లో అలివి వలల తో చేపల వేటను నిషేధిస్తూ గత రాత్రి పట్టుకున్న వలలను సీజ్ చేసి జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు… అలాగే 7 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ పర్యవేక్షణలో సోమశిల జలాశయం పరిధిలోని మత్స్యకారుల ప్రతి ఒక్క ఇంటిని తనిఖీ చేసి అలవి వలలను స్వాధీనపరచుకుంటామని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు కార్యక్రమంలో సోమశిల ఎస్ఐ కరీముల్లా పాల్గొన్నారు.