శ్రీ మఠం హుండీ ఆదాయం 2.20 కోట్లు
మంత్రాలయం, మార్చి 30, (సీమకిరణం న్యూస్) : :
ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం 33 రోజులకు రూ.2,20,04,730
వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ ఎస్ కె.శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని శ్రీ మఠం ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.నాణేల లెక్కింపు మాత్రమే మిగిలింది. మరో రెండు రోజుల్లో లెక్కింపు పూర్తి అవుతుందని మేనేజర్ తెలి పారు. కార్యక్రమంలో శ్రీ మఠం ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు భక్తాదులు పాల్గొన్నారు.