మేనేజ్మెంట్ టీచర్ల పదోన్నతులకు చర్యలు
అవుకు, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడానికి త్వరలో సర్వీస్ రూల్స్ రూపొందించడానికి విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు బుధవారం అవుకు మండలం లోని విద్యాసంస్థలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ పాటశాల,బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ 666 మండల విద్యాశాఖ అధికారి పోస్టులు 456 ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదం కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. 824 ఉన్నత పాఠశాలలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నారని వాటిలోని ప్రిన్సిపాల్స్ జూనియర్ లెక్చరర్స్ పోస్టులను అర్హులైన హెడ్మాస్టర్ లు స్కూల్ అసిస్టెంట్ లతో భర్తీ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు .ప్రతి పాఠశాలకు వాచ్మెన్ కంప్యూటర్ టీచర్ ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలు ,ఐ టి ఐ, కేజీబీవీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ తో పాటు యస్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రారెడ్డి రాష్ర్ట కౌన్సిలర్ జి వి ఎస్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.