జాతీయ యోగ రిఫరీగా అవినాష్
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహించిన జాతీయ స్థాయి “రిఫరీ డిగ్రీ” అర్హత పరీక్షలో జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించారు (మర్క్స్ 87/100).ఈ సందర్భంగా రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు విజయ్ కుమార్,సునీల్ కుమార్,నాగ రత్నమయ్య, డాక్టర్ రుద్ర రెడ్డి, ఈశ్వర్ నాయుడు, నాగరాజు,కిరణ్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.