జగన్ పాలనలో కరెంటు కోతలు, చార్జీల మోతలతో వాతలు
విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదు

జగన్ పాలనలో కరెంటు కోతలు, చార్జీల మోతలతో వాతలు
విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదు
తెలుగుదేశం పార్టీ నాయకులు
ఎమ్మిగనూరు. మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పాలనంతా నిత్యము కరెంటు కోతలతో చార్జీల మోత లతో,వాతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేడు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతూ “టారీఫ్” ను విడుదల చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురువారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగన్ రాష్ట్ర అభివృద్ధి పేరుతో దోపిడికి, దుబారాకు పాల్పడుతూ లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న చెత్త పన్ను విధించి, నేడు విద్యుత్ చార్జీలు అమాంతంగా పెంచడం సామాన్యుల నడ్డి విరిచడమేనని దుయ్యపడ్డారు. సామాజిక పింఛన్లను, సంక్షేమ పథకాలను తొలగించే కుట్రలో భాగమే విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు అన్నారు. 30 యూనిట్ల వరకు యూనిట్ పై 45 పైసలు,31-75 యూనిట్ల వరకు యూనిట్ పై 91 పైసలు,76-125 యూనిట్ల వరకు యూనిట్ పై 1.40 పైసలు,126-225 యూనిట్ల వరకు యూనిట్ పై 1.57 పైసలు,226-400 యూనిట్ల వరకు యూనిట్ పై 1.16 పైసలు,400 యూనిట్లు దాటితే 55 పైసలు విద్యుత్ చార్జీలు పెంచుతూ టారీఫ్ ను విడుదల చేయడం సిగ్గుచేటన్నారు.2018-19 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 10 వేల మెగావాట్ల విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేసి, 24 గంటల విద్యుత్ అందించి, ధరల స్థిరీకరణ చేస్తే జగన్ మాత్రం రెండేళ్లలో కేవలం 900 మెగావాట్ల ను అదనంగా ఉత్పత్తి చేసి నిత్యము కరెంటు కోతలతో ట్రూ ఆప్ చార్జీల వాతలు పెడుతున్నారని ఆరోపించారు.2018-19 ఒకే సంవత్సరంలో చంద్రబాబు తన హయాంలో.. గ్రామాలకు 60 లక్షలు LED బల్బులు అందించి గ్రామాలకు వెలుగులు నింపారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామన్న జగన్ అధికారం చేపట్టాక మోటార్లకు మీటర్లు బిగించి వ్యవసాయానికి ఉరితాళ్లు బిగించిన ఘన హీన చరిత్ర సీఎం జగన్ ది అన్నారు.పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదె న్న, జి. అల్తాఫ్, ఉప్పర ఆంజనేయులు, యన్. సురేష్ కుమార్, కె. యం. డి. జబ్బార్, రోజా ఆర్ట్స్ ఉసేని, కడివెల్ల లింగన్న, పీర్ భాష, దర్జీ మోషన్న, మాల మునిస్వామి, కడివెల్ల ఉరుకుంద గౌడ్, సుదర్శన్ గౌడ్,బడేసాబ్,ఎరుకల మారెన్న, గోర బాషా, మహబూబ్ బాషా, కె.శంకరన్న, ఆఫ్గన్ వలిబాషా తదితరులు పాల్గొన్నారు.