💐💐💐 శ్రీశైల క్షేత్రంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు 💐💐💐
శ్రీశైలం దేవస్థానం, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం ఉత్సవ భేరి మోగింది. శాస్త్రోక్తంగా ఉగాది మహో త్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు అంగరంగవైభవంగా కొనసాగనున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా కన్నడిగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్థానాచార్యులు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆనం తరం అర్చకులు కంకణాలను ధరించారు. రుత్వి కులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించారు.
అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు జరిపించారు.
💐ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ :
ఉగాది మహోత్సవాల్లో మొదటిరోజు శ్రీశైల భ్రమ రాంబాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి అలంకార మండపంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజాహారతులిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి రెండు చేతుల్లో పద్మాలను ధరించి, కింది చేతుల్లో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు.
💐భృంగివాహన సేవ 💐
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మ వార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి అలంకార మండపంలో పూజలు నిర్వహించారు.భృంగివాహనాధీశులైన ఆదిదంపతులను దర్శిస్తే పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేడు ;
ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భ్రమ రాంబా సమేత మల్లికార్జున స్వామివారికి కైలాస వాహనసేవ నిర్వహించనున్నారు. అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరపనున్నారు.