ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ…
-: మహిళా కూలీ మృతి…
-: మరో 10 మంది కూలీలకు గాయాలు…
ఆళ్లగడ్డ, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో ఉన్న నల్లగట్ల సమీపంలో ట్రాక్టర్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ కూలీ మృతి చెందగా మరో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన కూలీలు కడప జిల్లా పెద్దముడియం మండలం సుద్దపల్లెకి ట్రాక్టర్ లో పనికి వెళుతుండగా నల్లగట్ల సమీపంలో ట్రాక్టర్ ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడం తో ఈ ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ (60) అనే మహిళా కూలీ సంఘటన స్థలంలోనే మృతిచెందగా నాగరాజు, పవన్తో పాటు మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రు లను 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసు కున్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటమ్మ మృతదేహాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, బిజెపి ఇంచార్జ్ కిషోర్ రెడ్డి లు సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. డా. సుజాత తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.