స్వచ్ఛతా అంటే ఇదేనా…?
స్వచ్ఛతా అంటే ఇదేనా…?
– : ప్రధాన రహదారిలో మురుగు నీరు నిల్వ
చిప్పగిరి, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్…స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నినాదాలతో గ్రామాలు పరి శుభ్రంగా ఉంచాలని అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతా యని మాటలు చెబుతున్నారు తప్ప చేతులు పని చేయడం లేదని నంచర్ల వాసులు వాపోతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు ప్రతి నిత్యం మురుగు నీటితో నిదుకుంటున్నప్పటికీ సంబం ధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని అలాంటప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా చెందుతాయని నంచర్ల గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారి అయినప్పటికీ సొంతముగా ఇండ్లు ముందు గ్రావెల్ తోలు ఉన్నప్పటికీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు ఉన్న రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉందంటే అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఇప్పటికైనా అలాంటి వారిపై చర్యలు తీసుకొని రోడ్లపై పారిశుద్ధ్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.