
10 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్ టౌన్, మార్చి 31,(సీమకిరణం న్యూస్) :
డోన్ నియోజకవర్గ రైతులకు హంద్రీనీవా ద్వారా 28 చెరువులకు నీరు అందించి రైతులకు కు 10 వేల ఎకరాలకు నీరు అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఉద్యాన రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ప్యాపిలి జాతీయ రహదారి పక్కన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రైతు ఆదాయం గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందనిప్యాపిలి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు కొరకు 45/1ఏ, 1బి, 45/1బి2-1007, 46/1సి సర్వే నంబర్లలో 25.93 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్ లు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
..రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్ర ముఖ్యమంత్రికి డోన్ నియోజకవర్గం పైన ప్రత్యేక ప్రేమ వల్ల అధికారులు అందరూ కూడా బాగా ఆలోచన చేసి వెనకబడినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు రైతు ఆదాయం పెంచేందుకు ప్యాపిలి మండలంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్యాపిలి చుట్టుపక్కలతో పాటు అనంతపురం జిల్లా తాడిపత్రి, రాయలచెరువు, గుత్తి, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, పత్తికొండ ఏరియాలలో టమోటా, మామిడి, అరటి, ఉల్లిగడ్డ పంటలను రైతులు పండిస్తున్నారు. ప్రతి సంవత్సరం పంట పెరుగుతుందన్నారు. కెనాల్స్ లేవు కాబట్టి వరి, చెరకు లాంటి పంటలను రైతులు సాగు చేయడం లేదు. ఇక్కడ రైతులకు రెండు లేదా మూడు, నాలుగు ఎకరాలు మాత్రమే ఉండడంతో పూలు, పండ్ల తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో నుంచి వచ్చే వ్యాపారస్తులు రైతులు పండించిన పండ్లను కొనుగోలు చేసేందుకు ఊరూరు తిరిగి కొనుగోలు చేయలేరని, అలా కాకుండా మార్కెట్ ఏర్పాటు చేస్తే నేరుగా వ్యాపారస్తులు వచ్చి రైతు పండించిన పండ్లను కొనుగోలు చేస్తారన్నారు.అదే మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులకు అధిక లాభాలు పొందుతారని ఆయన అన్నారు. బెంగళూరు, చెన్నై, బాంబే ఇతర నగరాల నుంచి నేరుగా మార్కెట్ కి వచ్చి పండ్లను కొనుగోలు చేస్తారన్నారు. పెద్ద వ్యాపారస్తులు మార్కెట్ రావాలంటే గొప్ప మార్కెట్ ఉండడంతో పాటు అన్ని వసతులు ఉండాలన్నారు. ఎన్ని లారీలు, ఎంత సరకు వచ్చిన, కోల్డ్ స్టోరేజ్, లారీ డ్రైవర్లు బస చేయడానికి వసతి, ట్రేడర్స్ వస్తే వారికి మంచి గెస్ట్ హౌస్, నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం కలిగినటువంటి గొప్ప మార్కెట్ ఉండాలన్నారు. అలాంటి గొప్ప మార్కెట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు 50 కోట్లు తో ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. స్థానికులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మార్కెట్ కు మంచి స్థలం సేకరించాలని ఉద్దేశంతో ప్యాపిలి సమీపంలో జాతీయ రహదారి పక్కన 26 ఎకరాలలో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.
అనంతరం ప్యాపిలి మండలం, కలచట్ల గ్రామ సమీపంలో హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ కమ్ మోడల్ నర్సరీ ఏర్పాటు కోరకు క్షేత్రస్థాయిలో స్థలాన్ని మరియు ఇప్పటికే హార్టికల్చర్ కు స్వాధీనం చేసిన సిరికల్చర్ పాత భవనాన్ని పరిశీలించారు.మంత్రి గారి వెంట జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి, జడ్ పిటిసి శ్రీరామ్ రెడ్డి, ప్యాపిలి సర్పంచ్ లక్ష్మీదేవి, మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, ఎర్రగుంట్ల పల్లె రమేష్ విద్యాశాఖ కమిటీ చైర్మన్ నాగరాజు,ఆర్డీవో హరి ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడి పి.ఎల్.వరలక్ష్మి, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, కెడిసిసి సిఈఓ రామాంజనేయులు, ఎంపీడీవో ఫజలె. రహమాన, తాసిల్దారు. శివ రాముడు,వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.