మర్రిపాడు రైతు సంఘం అధ్యక్షుడిగా బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి

మర్రిపాడు రైతు సంఘం అధ్యక్షుడిగా బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి..
రైతులకు అందుబాటులో ఉంటా.
మర్రిపాడు, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
మర్రిపాడు మండలం రైతు సంఘం అధ్యక్షుడిగా ఖాదర్ పూర్ గ్రామానికి చెందిన బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి ని గురువారం నాడు మర్రిపాడు ఏకగ్రీవంగా యూ టీ ఎఫ్ భవనం లో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, రైతులకు కష్ట సుఖాలలో తోడు ఉంటానని రైతులకు ఒక్క చిన్న సమస్య ఎదురైనా తనకు తెలియపరచాలని అన్నారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి నష్టం చేకూరే నల్ల చట్టాలను వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా అవసరమైతే నిరసనలు ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్షలు,చేపడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని అన్నారు. రైతులకు ఎటువంటి కష్టం వచ్చిన తన ఫోన్ నెంబర్ +91 91006 08980 కు సంప్రదించాలని తెలిపారు.