TELANGANA

ప్రతి మండలాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలి

ఖమ్మం జిల్లా తెలంగాణ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డీఆర్వో శిరీష్ కు , రఘునాథపాలెం మండలం ఎమ్మార్వో నరసింహారావు కు వినతిపత్రం

ఖమ్మం , మార్చి 31, (సీమకిరణం న్యూస్) :

నగరంలో గురువారం ఖమ్మం జిల్లా తెలంగాణ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్  హిందువులకు వైకుంఠ ధామం , ముస్లింలకు కబరస్థాన్ ను ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా క్రిస్టియన్లకు బరియల్ గ్రౌండ్ ( సమాధుల తోట ) ను అలాగే ప్రతి మండలాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని కోరుతూ డీఆర్వో శిరీష్ కు , రఘునాథపాలెం మండలం ఎమ్మార్వో నరసింహారావు కు క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు కొరకు సుమారు వెయ్యి గజాల స్థలం మరియు ఒక్కొక్క మండలానికి మూడు ఎకరాలు సమాధుల కొరకు కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశారు . అట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్లాలని ఈ సారైనా వీలైనంతవరకూ మా సమస్యను పరిష్కరించాలని విన్నవించారు . గతంలో కూడా ఈ విషయంపై పలు అధికారులను , రాజకీయ నాయకులను కలిసిన ఇంతవరకు మాకు ఎటువంటి స్థలాన్ని చూపించలేదని పేర్కొన్నారు . చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న క్రిస్టియన్లు చనిపోతే వారిని సమాధి చెయ్యటానికి స్థలం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పాస్టర్ వింగ్ ఎస్.ఎస్.బి.ఎం. మహాసేన అధ్యక్షులు మంద . సంజీవ రావు , కార్యదర్శి వెగ్గళం. ఇమ్మానుయేలు , కోశాధికారి యన్ . లాజర్ , ఉపాధ్యక్షులు జోసెఫ్ నాయక్ , బోడా దానియేలు , నందిపాటి అభిషేక్ , శామ్యూల్ , విజయ్ కుమార్ , సురేష్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!